Monday, April 29, 2024

ఎఐతో నవప్రపంచం

- Advertisement -
- Advertisement -

World Economy

 

2030 నాటికి ప్రపంచ జిడిపిలో 40 శాతం వృద్ధి : దావోస్ వేదిక నుంచి కెటిఆర్

అందుకే 2020ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా తెలంగాణ ప్రకటించింది

హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను మార్చే సత్తా ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)కు ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. అన్ని రంగాల్లో ఎఐకు ప్రాధాన్యత పెరుగుతోందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుచూపుతూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరాన్ని (2020) ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించిందన్నారు. మంగళవారం దావోస్‌లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ‘సాధికారత ఎఐ నాయకత్వం’ పై జరిగినప్యానెల్ చర్చలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. భవిష్యత్తులో ఏ వ్యాపార రంగానికైనా ఎఐ తప్పనిసరి అని అన్నారు. ఐటి, ఐటియేతర పరిశ్రమలతో పాటు ఇతర రంగాలు కూడా ఎఐను అనుసరించాల్సిందేనన్నారు. ఎఐ సాంకేతికతను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణాలో అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సాంప్రదాయ పద్ధతుల సామర్థ్యానికి మించి ఎఐ పలు సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. పౌరుల జీవితాలను మార్చగల సామర్థ్యం ఎఐకు ఉందన్నారు. భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశ్రమ 2025 నాటికి 16 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, 2021 నాటికి 800,000 ఉద్యోగాలు లభిస్తాయని నాస్కామ్ నివేదిక పేర్కొందన్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ గుర్తు చేశారు.

2030 నాటికి ఎఐ ప్రపంచ జిడిపికి 40శాతానికి చేరుతుందన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను టాప్ 25 గ్లోబల్ ఎఐ ఇన్నోవేషన్ హబ్‌లో ఒకటిగా అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్షమన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఇటీవల ఎఐ- ప్రారంభించబడిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసిందన్నారు. పౌర డేటాను సమర్థవంతంగా ఉపయోగించడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను గుర్తించడంలో తమ ప్రభుత్వానికి సహాయపడుతుందన్నారు.

టెక్నాలజీ మారుమూల గ్రామానికి చేరువ చేయడంతో పాటు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పుల కోసం ఇటీవలే
తొమ్మిది కంపెనీలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, స్మార్ట్ సిటీలు,మౌలిక సదుపాయాలు, స్మార్ట్ మొబిలిటీ, రవాణా వంటి ఆర్థిక వృద్ధి,సామాజిక ప్రభావాన్ని పెంచగల రంగాలలో పరిశోధనలపై దృష్టి పెట్టామన్నారు. ఐటిలో సరికొత్త ఆవిష్కరణలకు దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోదన్నారు.

గత కొన్నేళ్లుగా ప్రముఖ ఐటి కంపెనీలను ఆకర్షించడమే కాకుండా, సమాజంలోని లోతైన మూలాలకు ఐటిని తీసుకెళ్లడం ద్వారా హైదరాబాద్‌కు గ్లోబల్ ఐటిలో చోటు దక్కించుకుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ సేవలకు మాత్రమే కాకుండా ఉత్పత్తి, అభివృద్దిలో పలు ఇంజనీరింగ్ కేంద్రాలకు నిలయంగా మారిందన్నారు. ప్రస్తుతం ఐటి రంగంలో పనిచేస్తున్న 50,000 మంది ఉద్యోగులలో సగం మంది ఐటియేతర సేవల్లో పనిచేస్తున్నారు. చాలా సంస్థలు ఇప్పటికే ఎఐ ని వారి అంతర్గత ప్రక్రియల కోసం ఉపయోగిస్తున్నాయని తెలిపారు. గ్లోబల్ ఎంటర్‌ప్రైజస్, రీసెర్చ్ సెంటర్లు, అకాడెమి, ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌ల బలమైన పర్యావరణ వ్యవస్థ హైదరాబాద్ ఆవిష్కరణలో విజయానికి ప్రధాన కారణమన్నారు.

వాస్తవానికి హైదరాబాద్‌ను టాప్ 25 గ్లోబల్ ఎఐ ఇన్నోవేషన్ హబ్‌లలో ఒకటిగా వెలుగొందులన్నాదే తమ లక్షమన్నారు. ఇది మొబిలిటీ, హెల్త్‌కేర్, అగ్రికల్చర్, ఇ..-గవర్నెన్స్ రంగాలలో మంచి ఆవిష్కరణకు దారితీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ (ఎంసిఐ) మంత్రి ఎస్. ఈశ్వరన్, ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా హెచ్. ఫోర్, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డిఎక్స్ సి టెక్నాలజీ, ఫ్రాన్స్ క్రోన్జే, కో- వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డేటాప్రొఫెట్ జెనీవీవ్ బెల్ తదితరులు పాల్గొన్నారు.

AI has potential to change World Economy
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News