Saturday, July 27, 2024

నేడే పుర బ్యాలట్ ఫైట్

- Advertisement -
- Advertisement -

Municipal polling

 

ఉదయం 7గం. నుంచి మున్సిపోలింగ్

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో మొత్తం ఓటర్లు 53,50,255 మంది

మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్‌లలో 382 వార్డుల్లో, జిహెచ్‌ఎంసి పరిధిలోని దబీర్‌పురా డివిజన్‌లో పోలింగ్
మున్సిపాలిటీల్లో 6188, కార్పొరేషన్‌లలో 1773 పోలింగ్ కేంద్రాలు
2053 పోలింగ్ స్టేషన్‌లలో లైవ్ వెబ్‌క్యాస్టింగ్, పోటీలో 12,843 మంది అభ్యర్థులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేషన్‌లకు బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏ ర్పాట్లు చేసింది. మున్సిపాలిటీల్లో 2727 వార్డులు, కార్పొరేషన్‌లలో 3 85 వార్డులకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇం దులో పురపాలికల్లో 80 ఏకగ్రీవం కాగా, కార్పొరేషన్‌లలో 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన వార్డులకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏకగ్రీవాలతో కలిపి మున్సిపాలిటీలకు 11,179 మంది, కార్పొరేషన్‌లకు 1747 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 7961 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 45 వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు.

ఈ నెల 25న ఓట్ల లెక్కింపునకు 10 వేల మంది సిబ్బందిని వినియోగించుకోనున్నారు. మొత్తం 53.50 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కును కలిగి ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో 2406 కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ ఉండనుంది. 50 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారు. పార్టీల వారీగా పోటీలో ఉన్న అభ్యర్థులు టిఆర్‌ఎస్ 2,972 మంది, కాంగ్రెస్ 2,616, సి పిఐ 177, బిజెపి 2,313 మంది, ఎంఐఎం 276, సిపిఎ ం 166, టిడిపి 347, స్వతంత్రులు 3,750 మంది బరి లో ఉన్నారు. ఇక జిహెచ్‌ఎంసి పరిధిలోని డబీర్‌పుర డివిజన్‌కు ఉప ఎన్నికకు 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 50 వేల మంది ఓటర్లు ఉన్నారు.

ఒక్క టెండర్ ఓటు పడినా.. రీపోలింగ్
మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క టెండర్ ఓటు పడినా, ఆ ప్రాంతంలో ఓట్ల లెక్కింపు చేపట్టబోమని, రీపోలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. తమ ఓటు వేరే ఎవరైనా వేసినట్లు తెలిస్తే, టెండర్ ఓటుకు సదరు ఓటరు డిమాండ్ చేయాలని ఆయన సూచించారు. ఇక దొంగ ఓట్లు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్‌లకు బుధవారం జరుగుతున్న పోలింగ్‌పై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఓటర్లు సౌకర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని చెప్పారు. మున్సిపాలిటీలలో 2647 వార్డులు, కార్పొరేషన్‌లలో 382 వార్డులలో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 83 వార్డులు ఏకగ్రీవం కాగా ఇందులో 80 మున్సిపాలిటీ వార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా 12,843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. తన ఒక్క ఓటు వేయకపోతే ఏంటి అని అనుకోవద్దని, ఈ ఎన్నికల్లో పదుల సంఖ్యలోనే గెలుపోటములు ఉంటాయన్నారు. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఐదేళ్లు పాలించే పాలకులను జాగ్రత్త సరిచూసుకుని ఓటు వేయాలన్నారు. డబ్బులకు ఆశపడవద్దన్నారు. ప్రతి వార్డులో సగటున 1700 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారని, 800 మంది ఓటర్లకు ఒక్క పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినందున పెద్దగా క్యూ ఉండదన్నారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లు అభ్యర్థుల గత చరిత్ర, ఆస్తులు, నేర చరిత్ర వివరాలు నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచామన్నారు.

120 పురపాలికల్లో 6188, 9 నగరపాలక సంస్థల్లో 1451 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల తనిఖీల్లో రూ. 44.41 లక్షల నగదు, రూ.16.25 లక్షల విలువ చేసే ఇతర వస్తువులు సీజ్ చేసినట్లు నాగిరెడ్డి వెల్లడించారు. పోలింగ్ మొత్తం నిఘా నీడలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. వీడియో కవరేజీ 2072 పోలింగ్ కేంద్రాల్లో, లైవ్ వెబ్‌క్యాస్టింగ్ 2053 కేంద్రాల్లో, మైక్రో అబ్జర్వర్స్ 2053 పోలింగ్ స్టేషన్‌లలో పోలింగ్ ముగిసే వరకు పర్యవేక్షణ చేస్తారన్నారు.

మొత్తం 53,50,255 మంది ఓటర్లు
ఈ ఎన్నికల్లో మొత్తం 53,36,605 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఇటీవల 5687 మంది ఓటర్లను డిలీడ్ చేశారు. ఇక మున్సిపాలిటీలలో 40,36,346 మంది ఓటర్లు, 9 కార్పొరేషన్‌లలో 13.13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌కు మొత్తం 45 వేల మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు ఎస్‌ఇసి కమిషనర్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం 10 వేల మంది సిబ్బందిని వినియోగించుకోనున్నట్లు పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్కాడ్స్ 285, స్టాటికల్ సర్వైలెన్స్ టీమ్స్ 360 పనిచేస్తున్నామన్నారు. మోడల్ కోడ్ కండక్ట్ కింద 40 రాతపూర్వక పిర్యాదులు రాగా, ఎస్‌ఇసి హెల్ప్‌లైన్‌కు 70 వచ్చాయన్నారు.

ఎన్నికల ఖర్చు పరిమితి దాటితే అనర్హతే
ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల ఖర్చులపై తప్పుడు లెక్కలు చూపిస్తే అనర్హత వేటు వేస్తామని హెచ్చరించారు. ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలే అడ్డుకోవాలన్నారు. పెద్దపల్లిలో ఒక వార్డులో డబ్బులు పంచుతున్న వీడియో వచ్చిందని, దానిపై కేసు నమోదు చేసి ఛార్జీషీట్ వేసినట్లు తెలిపారు. జోగులాంబ, గద్వాల నుంచి కూడా ఇలాంటి కేసు వచ్చిందన్నారు. ఎన్నికల్లో అత్యధికంగా ఖర్చు పెట్టే వాటిపై ఆధారాలతో నిరూపిస్తే గెలిచిన వారి ఎన్నిక చెల్లదన్నారు. ఒకవేళ ఖర్చుల పట్టిక అభ్యర్థి సరిగ్గా ఇవ్వకపోయినా, పరిమితి దాటి ఖర్చు పెట్టినట్లు ఆధారాలు చూపినా ఎస్‌ఇసి అనర్హత వేటు వేస్తుందన్నారు.

‘పుర’ పోలింగ్‌కు 50వేల పోలీసులతో
బందోబస్తు : నోడల్ అధికారి, ఎడిజిపి జితేందర్ వెల్లడి
రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీ, 9 కార్పొరేషన్లుకు బుధవారం (నేడు) జరురుగునున్న ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్చాయుతంగా నిర్వహించేందుకు 50వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారని ఎన్నికల నోడల్ అధికారి, ఎడిజిపి జితేందర్ మంగళవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించిన 131 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అదేవిధంగా ఎన్నికల సందర్బంగా ఓటర్లను ప్రలోబాలకు గురిచేసే విధంగా డబ్బు, మద్యం, బహుమతులు పంపిణీ జరుగకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో రూ. 51,36,090 నగదుతో పాటు రూ.21,22,933 విలువైన మద్యాన్ని వేర్వేరు ప్రాంతాలలో ఫ్లైయింగ్ స్కాడ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారన్నారు. చట్టాన్ని అతిక్రమించిన 4,969మందిపై 1122 కేసులను నమోదు చేశామని, ముందస్తు జాగ్రత్తలో భాగంగా 1745 లైసెన్స్ రివాల్వర్‌లను డిపాజిట్ చేయించామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు తెలంగాణ స్పెషల్ పోలీస్‌లతో పాటు ఇతర ప్రత్యేక పోలీసు దళాలను రంగంలోకి దించామన్నారు. ముఖ్యంగా తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు, సమస్యాత్మకం ప్రాంతాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన వ్యూహాత్మ ప్రాంతాలలో నియమించామన్నారు.

Today Municipal polling
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News