దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల భద్రతకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరిం చాయి. ఉగ్రవాద, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేప థ్యంలో, అన్ని ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటిం చారు. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 మధ్య విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉంద ని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో, కేంద్ర పౌర విమానయాన భద్రతా బ్యూరో అన్ని ఎయిర్ పోర్టులకు అడ్వైజరీ జారీ చేసింది. ఎయిర్ పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. రన్ వేలు, హెలీప్యాడ్స్, ఫ్లయింగ్ స్కూల్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లలో భద్రత పెంచా లని సూచిం చింది.
ఈ క్రమంలో, విమానాశ్రయాల వద్ద భద్రతా సిబ్బంది అలర్ట్ అయింది. టెర్మినల్స్, పార్కింగ్ ఏరియా, పెరీమీటర్ జోన్ తదితర సున్నితమైన ప్రాంతాల్లో పెట్రో లింగ్‌ను పెంచారు. స్థానిక పోలీసుల సహకారంతో ఎయిర్ పోర్టులకు వెళ్లే మార్గాల్లో తనిఖీలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. విమానా శ్రయ సిబ్బంది, కాంట్రాక్టర్లు, విజిటర్స్ ను కూడా తనిఖీలు చేయాలని నిర్ణయిం చారు. ఇదే సమయంలో ప్రయాణి కులకు కూడా అధికారులు పలు సూచనలు చేశారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కానీ, వస్తువులు కానీ కనిపిస్తే వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయాణికులకు సూచించారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో…!
కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు. రాను న్న కాలంలో సంఘ వ్యతిరేక శక్తులతో పాటు ఉగ్రమూకల దాడుల కొనసాగే ఆస్కారం ఉందంటూ కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీని పటిష్టం చేశారు. ఎయిర్‌పోర్టులో అణవణువు భద్రతాదళాల కనుసన్నల్లో ఉండే విధంగా ప్రణాళికా యుతమైన చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టారు. సందర్శకుల తాకిడిని సైతం కట్టడి చేయనున్నారు.