Thursday, September 25, 2025

‘అఖండ 2’ షూటింగ్ పూర్తి?

- Advertisement -
- Advertisement -

‘గాడ్ ఆఫ్ ది మాసెస్’ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి కలిసి పనిచేస్తున్న హై- ఆక్టేన్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను ఎం తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 600 మంది డ్యాన్సర్లతో అదిరిపోయే మాస్ సాంగ్‌ను చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. అయితే మేకర్స్ ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేసినట్టుగా తెలిసింది. దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ‘అఖండ 2: తాండవం’ రిలీజ్ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News