Thursday, May 2, 2024

గ్రూప్ 4 పరీక్షకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: గ్రూప్ 4 పరీక్షకు జిల్లాలో సర్వం సిద్దం చేశారు. నేడు ఉదయం 10 గంటలకు జిల్లాలోని 101 పరీక్ష కేంద్రాల్లో 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. 24 మంది రూట్ ఆఫీసర్‌లు 24 మంది అసిస్టెంట్ ఆఫసీర్‌లు, 101మంది ఛీఫ్ సూపరింటెండెంట్‌లు, 101మంది లైజన్ అధికారులను అత్యవసరమైనంత మంది ఇన్విజిలేటర్‌లను నియమించారు. గ్రూప్ 4 పరీక్షలపై టిఎస్‌పిఎస్‌సి జారీ చేసిన కీలక సూచనలను అభ్యర్థులు తప్పక పాటించాలని కలెక్టర్ తెలిపారు. గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారని నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

పేపర్ 1 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12ః30 గంటల వరకు పేపర్2 మధ్యాహ్నం 2ః30 సాయంత్రం 5గంల వరకు జరుగుతుందన్నారు. పేపర్ 1కు ఉదయం 8 గంటల నుండి 9ః45 వరకు పేపర్ 2కు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2ః15 వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు భధ్రతా సిబ్బంది పరీక్ష గదిలోకి చేరుకున్నాక, ఇన్విజిలేటర్‌కు ఫొటో గుర్తింపు కార్డు,, హాల్ టికెట్‌ను చూపించాలని తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థిని పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. అభ్యర్థి కాకుండా పరీక్షకు వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు సంబంధిత అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు పరీక్ష వ్రాస్తున్నందున ఈసారి వేలి ముద్రను తప్పనిసరిచేశారని నామినల్ రోల్‌లో సంతకం తరువాత ఎడమచేతి బొటన వేలి ముద్ర కోసం ప్రత్యేక స్థలాన్నీ కేటాయించారని తెలిపారు.

వేలి మేముద్రలను పరీక్ష అయినపోయిన తర్వాత అభ్యర్థులు బయటకు వెళ్లాలన్నారు. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి వేలిముద్ర వేయాలన్నారు. అరగంటకొకసారి అభ్యర్థులకు సమయాన్నీ గుర్తుచేస్తూ బెల్‌మోగిస్తారని పరీక్ష ముగియడానికి 5నిమిషాల ముందు బెల్ మోగిస్తారన్నారు. అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదని తెలిపారు. ఓఎంఆర్ జవాబు పత్రంలో హాల్‌టికెట్ నంబర్ ప్రశ్న పత్రం నంబరు పరీక్ష కేంద్రం కోడ్ అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలన్నారు. ఓఎంఆర్ పత్రంలో బ్లూ బ్లాక్ పెస్‌తో పేరు కేంద్రం కోడ్, హాల్ టికెట్ నంబర్ ప్రశ్నపత్రం నంబరు రాయాలని తెలిపారు. హాల్ టికెట్ ప్రశ్న పత్రం నంబరు సరిగ్గా రాయకున్నా బ్లూ బ్లాక్ పాయింట్ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ పత్రం చెల్లుబాటుకాదన్నారు.

అభ్యర్థి తప్పిదాల వల్ల ఓఎంఆర్ మార్చే వీలు కాదని, రాయడం మరియు బిల్డింగ్ జాగ్రత్తంగా చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు రిమోట్ కూడిన కారు తాళాలు విలువైన నిషేధిత వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరని అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలని, షూ వేసుకొని రావద్దని తెలిపారు. పరీక్ష ముగిసేంత వరకు అభ్యర్థులు పరీక్ష హాల్‌లోనే ఉండాలని ముందుగా బయటకు అనుమతించరని స్పష్టం చేశారు. పూర్తి గ్రుడ్డివారు రెండు చేతులులేని వారు సెరిబ్రల్ పాల్సి 40శాతం పైబడిన అభ్యర్థులకు స్ర్కైబ్స్ ద్వారా పరీక్ష వ్రాయుటకు ముందస్తు అనుమతి అవసరమని వారిని సదరం ధృవీకరణ పత్రం అనుమతిస్తారని తెలిపారు.

పరీక్ష కేంద్రంలోనికి ఛీఫ్ సూపరిండెంట్ మరియు లైజన్ అధికారికి మాత్రమే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లుటకు అనుమతి కలదని తెలిపారు. మిగతా అధికారులు ఇన్విజిలేటర్‌లు, సిబ్బంది మరియు అభ్యర్థులు తమ మొబైల్ ఫోన్లు స‚ఆ్మర్ట్ వాచీలు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం బయటనే డిపాజిట్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు ఆయా నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్ష వ్రాసి విజయం సాధించాలని శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News