Friday, May 3, 2024

సుకుమార్‌తో చిత్రం ‘శేషాచలం’?

- Advertisement -
- Advertisement -

Allu Arjun and Sukumar

ఏడాదిన్నరకు పైగా గ్యాప్ తీసుకొని చేసిన ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ సినిమాలో నటించనున్నారు బన్నీ. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌లో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్‌ను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కథకు సరిపోయే విధంగా ఉండే ఈ టైటిల్‌ను ఖరారు చేయాలనే ఆలోచనలో సుకుమార్ ఉన్నారట. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ఈ మూవీలో ప్రముఖ యాంకర్, నటి అనసూయ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. అయితే ఆమె నటించే పాత్ర ఏమిటి? ఎలా ఉంటుంది? అనే విషయాలు ఇంకా తెలియలేదు.

Allu Arjun and Sukumar Film Title Seshachalam?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News