Friday, September 20, 2024

చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అలా తెలపడంతో…. అల్లుపై మెగా అభిమానులు ట్రోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మెగాస్టార్ చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మన మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అల్లు ట్వీట్‌పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో అర్జున్‌కు లైఫ్ ఇచ్చిన చిరుకు ఇంత సింపుల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోస్టు కామెంట్లలో ఇంద్ర సినిమాలో చిరు మేన కోడలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పెళ్లి మండపం నుంచి శివాజీ వెళ్లిపోయిన సంఘటన వీడియోను వైరల్ చేస్తున్నారు.  అల్లు అర్జున్‌ను చిరు ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోను తీసి మెగా అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. స్టేటస్ పెరగగానే అల్లు అర్జున్ కళ్లు నెత్తికెక్కాయని  మండిపడ్డారు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవారిని జీవితంలో మర్చిపోకూడదన్నారు. అల్లు అర్జున్ అటిట్యూడ్ తగ్గించుకోవాలని ఐకాన్ స్టార్‌కు మెగా ఫ్యాన్స్ చురకలంటిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News