Friday, May 3, 2024

3 నిమిషాల్లో 15 వేల అడుగుల కిందికి

- Advertisement -
- Advertisement -

నార్త్ కరోలినా : అమెరికాలో విమాన ప్రయాణికులు అత్యంత అరుదైన భయానక పరిస్థితిని ఎదుర్కొన్నారు. నార్త్ కరోలినాలోని ఛార్లెట్ నుంచి ఫ్లోరిడాకు బయలుదేరిన అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం నెంబరు 5916లో ఉన్నట్లుండి గాలి పీడన పరిస్థితి ( ప్రెషరైజేషన్ ఇష్యూ) ఏర్పడింది. దీనిని గుర్తించి విమాన పైలట్ ఆకస్మికంగా దీని ఎత్తును మూడు నిమిషాల వ్యవధిలో ధడేల్‌మంటూ 15వేల అడుగుల కిందికి దించారు. ఈ తక్కువ ఎత్తులో విమాన ప్రయాణం సాఫీగా సాగింది కానీ ఉన్నట్లుండి ఎత్తు తగ్గించడంతో ప్రయాణికులకు రిస్క్ ఏర్పడింది. అయితే ఇటువంటి రిస్క్ పరిస్థితి లేకుండా చేసేందుకే ఎత్తును దించినట్లు అమెరికా ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ మూడు నిమిషాలు విమానంలో ఇంధనం కాలిన వాసన, విమానాన్ని దింపుతున్నప్పటి భీకర చప్పుళ్ల గురించి ఇప్పుడు చెప్పలేకపోతున్నామని,

ఎందుకు అంటే వీటిని చిత్రీకరించేందుకు వీలులేదని విమాన ప్రయాణికులలో ఒకరైన ఫ్లోరిడా వర్శిటీ ప్రొఫెసర్ హరిసన్ హోవే తెలిపారు. ఆక్సిజన్ మాస్క్‌లతోబిగ్గరగా ఊపిరిపీల్చుకుంటూ గడపాల్సి వచ్చింది. కొందరికైతే ప్రాణాలు పోయినట్లే అన్పించి ఉంటుందన్నారు. తానైతే తరచూ విమానాల్లో వెళ్లివస్తుంటాను కాబట్టి తట్టుకున్నానని, మరి కొత్తవారికి, ఎక్కువగా ప్రయాణాలు చేయని వారి పరిస్థితి దారుణం అయి ఉంటుందన్నారు. మొత్తం మీద అంతా క్షేమంగా చేరుకోగల్గినట్లు ఇది మంచిదే అన్నారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడానికి ముందు 26 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తోంది. కాగా 3 నిమిషాల వ్యవధిలో దీని ఎత్తు దిగజార్చినట్లు వెల్లడైంది. లోపల ప్రయాణికులు ఉన్న దశలో ఈ పరిస్థితి ఏర్పడటంతో ఆందోళన వ్యక్తం అయింది. తరువాత 11 నిమిషాలకు దీని ఎత్తు 20వేలకు దిగింది. సాంకేతిక లోపం గమనించి దీనిని తక్కువ ఎత్తులో నడపడమే సురక్షితం అని భావించి ఈ చర్యకు దిగాల్సి వచ్చిందని విమాన సంస్థ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News