Sunday, June 16, 2024

గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధ్దురాలు మృతి

- Advertisement -
- Advertisement -

 


నర్సాపూర్ (జి): మండలంలోని బుర్గుపల్లి కె గ్రామానికి చెందిన దుగ్గి భోజవ్వ (70) అనే వృద్దురాలు 61వ జాతీయ రహదారిపై రోడ్డు దాడుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందిందని పోలీసులు తెలిపారు.

పోలీసులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం భోజవ్వ సోమవారం తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కాలు, చేయి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిందని తెలిపారు. మృతురాలు మరిది కొడుకు దుగ్గి లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవీందర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News