Tuesday, October 15, 2024

తిరుమల లడ్డూలో జంతు కొవ్వు…. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: ప్రణీత

- Advertisement -
- Advertisement -

తిరుమల: శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణమని నటి ప్రణీత మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆమె స్పందించారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరని తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె పోస్టు చేశారు. ఈ పోస్టు వైరల్ అవుతుండడంతో టిటిడిపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై స్పందించినందుకు ఆమెను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరగడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శ్రీవారి లడ్డూలో పాలకు బదులు ఇతర జంతువుల కొవ్వులు కలిసినట్టు గుజరాత్ రాష్ట్రానికి చెందని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. తిరుమలలో లడ్డూలలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప కొవ్వు కలిసినట్టు అనవాళ్లు ఉండొచ్చని అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News