Thursday, May 2, 2024

షర్మిల పార్టీకి మరోనేత గుడ్.. బై

- Advertisement -
- Advertisement -

Another leader goodbye to Sharmila's party

హైదరాబాద్: రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధిస్తానని పార్టీ ప్రారంభించిన వైఎస్‌ఆర్‌టిపికి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. వైఎస్ షర్మిల పార్టీని ఆరంభించినప్పటి నుంచి ఊహించని షాక్‌లు తగుతూనేవున్నాయి. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా కన్వినర్ ఇబ్రహీం పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీలో రాఘవరెడ్డి తీరుపై అంసతృప్తితో ఉన్నామని, పార్టీలో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంల లేదని పేర్కొంటూ పార్టీకి రాజీనామా చేశారని ఇబ్రహీం సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా వైఎస్‌ఆర్‌టిపి రాష్ట్రంలో పార్టీ పటిష్టం చేసుకునేందుకు నిర్మాణాలను బలపర్చుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కన్వీనర్లను కూడా నియమించిన నేపథ్యంలో అందులో ఇద్దరు పార్టీకి గుడ్‌బై చెప్పి వెళ్లిపోయారు.

ఇటీవల వైఎస్‌ఆర్టీపీలో కీలక నేత ఉన్న ఇందిరా శోభన్ ఆ పార్టీ రాజీనామా చేసి కలకలం రేపిన విషయం విదితమే. ఆమె వైఎస్‌ఆర్టీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇందిరా శోభన్ తెలిపారు. గతంలో వైఎస్సార్టీపీకి చేవెళ్ల ప్రతాప్రెడ్డి గుడై చెప్పిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఆ పార్టీకి ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందని అందువల్ల నేతలు రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్‌ఆర్‌టిపిలో ఓటుబ్యాంకు కలిగిన నేతలు ఒక్కరు కూడా లేరని చెప్పవచ్చు. అదేవిధంగా అర్థ,అంగ బలం కలిగిన నాయకులు లేకపోగా, ఉన్న తృతీయశ్రేణి నాయకులు సైతం పార్టీని వీడుతుందటం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News