Friday, May 3, 2024

కేజ్రీవాల్‌కు జైలులో పొంచి ఉన్న ముప్పు:ఆప్ ఎంపి సంజయ్ సింగ్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై లోతైన కుట్ర జరుగుతోందని, తీహార్ జైలులో ఆయనకు ఎటువంటి ప్రమాదమైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ శుక్రవారం ఆరోపించారు. ఎవరినైనా చంపేంత నీచానికి బిజెపి దిగజారుతుందని ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రాణాలకే ముప్పు తీసుకువచ్చే కుట్రలో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంలో ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని తెలియచేసేందుకు ఆప్ నాయకులు ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్రపతిని కలుస్తారని ఆయన తెలిపారు.

తనకు ఇన్సులిన్, మందులు సమకూర్చాలని కోరుతూ కేజ్రీవాల్ కోర్టులో పిటిషన దాఖలు చేశారని ఢిల్లీ మంత్రి అతిషి విలేకరులకు తెలిపారు. డయాబెటిక్ రోగి అయిన కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందచేయడానికి కేంద్రం, ఇడి, తీహార్ జైలు అధికారులు ఎందుకు నిరాకరిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. స్వాతంత్య్రానికి పూర్వం జైలు ఖైదీల పట్ల ఈ రకంగా ప్రవర్తించేవారని విన్నామని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. ఏ చట్ట నిబంధనల కింద కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిని ఇడికి తీహార్ జైలు అధికారులు అందచేశారని ఆమె ప్రశ్నించారు. మనీ లాండరింగ్‌పై ఇడి దర్యాప్తు మాత్రమే చేయాలని ఆమె అన్నారు. కేజ్రీవాల్ తినే రొట్టెలలో ఆప్ నాయకులు డబ్బేమైనా కలిపారా అని ఆమె ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News