Thursday, May 2, 2024

రూ. 9497 కోట్ల నివాస విక్రయాలను నమోదు చేసిన అపర్ణ కన్‌స్ట్రక్షన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో నివాస గృహాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. క్యూ4, 2023లో 16,808 లావాదేవీలు నమోదయ్యాయని స్క్వేర్ యార్డ్స్ తమ నివేదిక లో వెల్లడించింది. ముఖ్యంగా, అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ఈ త్రైమాసికాల్లో తన అగ్రస్థానాన్ని కొనసాగించింది, వాల్యూమ్, యూనిట్ల సంఖ్య పరంగా ఇది 621 యూనిట్లు, మొత్తం రూ. 510 కోట్లతో మళ్లీ చార్టులలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్తి రిజిస్ట్రేషన్ రికార్డుల నుండి స్క్వేర్ యార్డ్స్ సేకరించిన డేటా ప్రకారం, అక్టోబర్-డిసెంబర్ కాలంలో సుమధుర ఇన్‌ఫ్రాకాన్ రూ. 196 కోట్ల విలువైన 145 యూనిట్లను విక్రయించి తరువాత స్థానం లో నిలవగా టాప్ 10 డెవలపర్‌ల జాబితాలో కొత్తగా ప్రవేశించిన మైస్కేప్ ప్రాపర్టీస్ అగ్ర డెవలపర్‌ల జాబితాలో కొత్తగా ప్రవేశించింది, అయితే BSCPL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమ్మకాల విలువ పరంగా దాని స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

“దేశంలోని ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో మార్కెట్ ఆశాజనకంగా దాని సరసమైన ప్రాపర్టీ ధరల నుండి వచ్చింది. ఈ అనుకూలమైన ధర పెట్టుబడిదారులకు, గృహ కొనుగోలుదారులకు లాభదాయకమైన ధర వద్ద మార్కెట్‌లోకి ప్రవేశించడానికి అద్భుతమైన అవకాశాన్ని అందించింది. అంతేకాకుండా, ఇన్వెస్టర్లకు అనుకూలమైన విధానాలు, అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు, మెరుగైన కనెక్టివిటీ తో పాటుగా స్థిరమైన ఆస్తి ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను అపూర్వమైన స్థాయికి నడిపించాయి”అని స్క్వేర్ యార్డ్స్ ప్రిన్సిపల్ పార్టనర్ దేబయన్ భట్టాచార్య అన్నారు.

Q4, 2023లో అత్యధిక లావాదేవీలు(8058) వెస్ట్ జోన్‌లో జరిగాయి. వెస్ట్ జోన్‌లోని ప్రధాన మైక్రో మార్కెట్లు సంవత్సరాలుగా సంతృప్తమవుతున్నందున, సెంట్రల్ జోన్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌కు డిమాండ్ వ్యాపించింది. ఈస్ట్ జోన్‌లో కూడా రూ. 965 కోట్ల విలువైన లావాదేవీలు (2536) జరిగాయి. నార్త్ జోన్ 2179 లావాదేవీలతో ఊగిసలాడుతోంది.

మౌలిక సదుపాయాల అభివృద్ధిలో హైదరాబాద్ భారీ ప్రగతి సాధించినప్పటికీ, నగరం ఆకర్షణీయమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థోమత, చురుకైన ప్రభుత్వ మద్దతు, సుసంపన్నమైన కాస్మోపాలిటన్ సంస్కృతి భారతదేశంలో పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా హైదరాబాద్ ను నిలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News