Sunday, April 28, 2024

బంగాళాఖాతంలో తీవ్రమవుతున్న అసని తుఫాను

- Advertisement -
- Advertisement -

Asani Cyclone

విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో  అసని తుఫాను బలపడుతోంది. ఇది మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చనుంది. గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. విశాఖకు ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమై ఉంది. ఈరోజు నుంచి ఈనెల 10వ తేదీ వరకు కోస్తాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర తీరంలో గంటకు 40 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో కూడా గాలులు వీచే అవకాశం కూడా ఉంది. తుఫాన్‌ ప్రభావంతో కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అసని తుఫాన్‌ ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లోని పలు మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విజయవాడలో ఆకాశం మేఘావృతమై, భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు, గంపలగూడెం మండలాల్లోని పలుగ్రామాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా మామిడి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సూచించింది.

Asani Cyclone

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News