Monday, July 22, 2024

టీమిండియా కోచ్‌గా గౌతం గంభీర్!: అశ్విన్ ప్రశంసలు

- Advertisement -
- Advertisement -

టీమిండియా ప్రధాన కోచ్‌గా భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు దాదాపు ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంభీర్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా గంభీర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. గంభీర్ అసాధారణ పోరాట యోధుడన్నాడు.

ఇటీవల ముగిసిన ఐపిఎల్‌లో మెంటార్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను విజేతగా నిలపడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. అలాంటి ఆటగాడు టీమిండియాకు వస్తే తాను ఎంతో సంతోషిస్తానన్నాడు. గంభీర్ పేర్యవేక్షణలో యువ ఆటగాళ్లు మరింత రాటుదేలడం ఖాయమన్నాడు. క్రికెటర్‌గా భారత్‌పై తనదైన ముద్ర వేసిన గంభీర్ కోచ్‌గానూ రాణిస్తాడనే నమ్మకం ఉందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News