Monday, May 6, 2024

మహిళ ఐపిఎస్‌ను లైంగికంగా వేధించిన జవాన్

- Advertisement -
- Advertisement -

 

ఇంఫాల్: ఓ ఐపిఎస్ అధికారిణిని జవాన్ లైంగికంగా వేధించిన సంఘటన మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….  ఐపిఎస్ అధికారిణి తన సిబ్బందితో కలిసి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో అస్సామ్ రైఫిళ్‌కు చెందిన జవాను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రయణిస్తున్న కారును పదే పదే కొట్టాడు. దీంతో కారులో ఉన్నది ఐపిఎస్ అధికారిణి అని సిబ్బంది చెప్పినా కూడా జవాన్ పట్టించుకోలేదు. ఖుదెంతాబి చెక్‌పోస్టు వద్ద కారు ఆగినప్పుడు విండోను పలుమార్లు జవాన్ కొట్టాడు. దీంతో ఐపిఎస్ అధికారణి తెంగ్‌నౌపాల్ పోలీస్ స్టేషన్‌లో సదరు జవాన్‌పై ఫిర్యాదు చేసింది. అనంతరం మణిపూర్ డిజిపికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో జవాన్‌ను కఠినంగా శిక్షిస్తామని మణిపూర్ డిజిపి ఎల్‌ఎం ఖౌతే తెలిపాడు.

 

Assam rifles Jawan molests MP Women IPS Officer
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News