Friday, May 3, 2024

ముగిసిన సుదీర్ఘ అంతరిక్ష యాత్ర.. క్షేమంగా భూమికి చేరిన వ్యోమగాములు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : నాసా వ్యోమగామి ఫ్రాంక్ రూబియో, రష్యావ్యోమగాములు సెర్గే ప్రొకోపీవ్, దిమిత్రి పెటెలిన్‌లు తమ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించుకుని భూమికి చేరారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సోయజ్ ఎంఎస్23 స్పేస్ క్రాఫ్ట్‌లో బయలుదేరిన వీరు కజక్‌స్థాన్‌లో సురక్షితంగా ల్యాండ్ అయారు. ఈ ప్రయాణం 157.4 మిలియన్ మైళ్లు. వాస్తవానికి ఈ మిషన్ ఆరు నెలల్లోనే పూర్తి కావలసి ఉంది. అయితే 2022 డిసెంబర్‌లో రష్యన్ స్పేస్ క్రాఫ్ట్‌లో ఊహించని లీక్ చోటు చేసుకోవడంతో గడువు పొడిగించారు.

దాంతో వ్యోమగాములు అంతరిక్షంలో 371 రోజులు గడపాల్సివచ్చింది. అంతకు ముందు నాసా వ్యోమగామి మార్క్ వాన్ డే హే 355 రోజులు గడిపి రికార్డు సృష్టించారు. రూబియో 2022 సెప్టెంబరు 21న అంతరిక్షం లోకి వెళ్లారు. 2023 సెప్టెంబర్ 11న ఆయన మార్క్ అంతరిక్ష యాత్ర రికార్డు బద్దలు కొట్టారు. ఇక అంతరిక్ష కేంద్రంలో గడిపిన సమయంలో రూబియో అనేక శాస్త్రీయ పరిశోధనలకు సహకరించారు. భవిష్యత్తులో అనేక మిషన్లను చేపట్టడానికి నాసా సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన పరిశోధనల సమాచారం ఎంతో విలువైనదిగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News