ఢిల్లీ: పాకిస్థాన్ కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చామని వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) తెలిపారు. కూల్చిన వాటిలో ఎఫ్-16 ఎస్ యుద్ధ విమానం కూడా ఉన్నాయని అన్నారు. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాలు కూల్చినట్లు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిర్వహించిన 3 నెలల తర్వాత ప్రకటన చేశామన్నారు. మే 9, 10 తేదీల్లో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని తెలియజేశారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని, మే 9వ తేదీ రాత్రి ఎక్కువగా పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేశామని, అన్నారు. ఉగ్రస్థావరాలపై 300 కి.మి. దూరం నుంచి మిసైళ్లు ప్రయోగించామని అన్నారు. ఎస్. 400 గగనతల రక్షణ వ్యవస్థలను సైతం విజయవంతంగా అధిగమించామని, తమ పోరాట పటిమను ప్రదర్శించామని చెప్పారు. డ్రోన్ వ్యవస్థ కూడా బాగా పనిచేసిందని కొనియాడారు. పాకిస్థాన్ తో పాటు పివొకెలోని ఉగ్రస్థావరాలపై కూడా దాడులు చేశామని వాయుసేన చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.
పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించాం: వాయుసేన చీఫ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -