కుత్బుల్లాపూర్ నియోజక వర్గం భగత్ సింగ్ నగర్ సర్వే నంబర్ 155 లో ప్రభుత్వ స్థలం కబ్జాదారుల పాలవుతుంది, అక్రమ నిర్మాణాలు చేపట్టి అమ్మకాలు చేపడుతున్నారని దానిని కాపాడాలని స్థానిక వ్యక్తి దూదేకుల, అల్లా బక్షు (55) అనే వ్యక్తి గతంలో హైడ్రాకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కబ్జా స్థలానికి గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ నేరుగా పరిశీలించి కబ్జాను అడ్డుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు ఆదేశించి వెళ్లిపోయారు. అయితే అధికార పార్టీ ప్రోత్బలంతో, గాజులరామారం సర్కిల్ అధికారుల నిర్లక్ష్యంతో సర్వేనెంబర్ 155 లో ఎటువంటి అనుమతులు లేకుండా 20 కి పైగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి.
దీంతో ఫిర్యాదుదారుడు అల్లా బక్షు దాదాపు 100 మంది మహిళలను వెంటబెట్టుకొని ఇటీవల హైడ్రాను మరోసారి ఆశ్రయించాడు. హైడ్రా అధికారి రంగనాథ్ వచ్చి వెళ్లిన కబ్జాలు ఆగటం లేదని, నిర్మాణాలు రూపొందుకున్నాయని ఆధారాలు ఫోటోలు చూపించారు. దీంతో బాధితులతో మాట్లాడిన హైడ్రా అధికారులు ఖాళీ స్థలాన్ని కబ్జా కాకుండా గురువారం జీడిమెట్ల పోలీసుల బందోబస్తు మధ్య ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఒకవైపు హైడ్రాధికారులు ఫెన్సింగ్ వేస్తుండగానే కొంతమంది కబ్జాదారులు ఫిర్యాదు దారుడు అల్లాబక్షుపై ఇంటికి వెళ్లి దాడిచేసారు.
అల్లాబక్షు పై హత్యాయత్నం
హైడ్రాకు ఫిర్యాదు చేసి స్థలాన్ని కాపాడే ప్రయత్నం చేసిన ఫిర్యాదుదారుడు అల్లా బక్షు పై భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన కొండల శ్రీధర్ రావు, బాలు అనే వ్యక్తులు 20 మందితో కలిసి తన ఇంటి పై దాడి చేశారని అల్లా బక్షు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తనపై జరిగిన దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన తన భార్యపై కూడా చేసి గాయపరిచారని, చూసి అడ్డుకోకపోయినా లక్ష్మమ్మ, గత సుబ్బమ్మ లను లాగి పరేశారని, గతంలో వీడియో తీసిన యువకుడిని చితక భాదరిని, వీడియోలు డిలీట్ చేసి నిన్ను చంపేస్తామంటూ కాలనీలో భయభ్రాంతులను సృష్టించారని హైడ్రా ఫిర్యాదుదారుడు అల్లాబక్షు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యప్తు చేపడుతున్నారు.