Wednesday, May 1, 2024

డాడీ అంతిమ యాత్రలో కూతురు… కన్నీళ్లు ఆపుకోలేరు

- Advertisement -
- Advertisement -

 

సిడ్నీ: హృదయం బద్దలయ్యే ఈ చిత్రం సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది. ఆస్ట్రేలియాలోని అటవీలో చెలరేగిన కార్చిచ్చు ఆర్పేయడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది అండ్రూ ఓ డయ్యర్ మృతి చెందాడు. అండ్రూ అంతిమ యాత్రలో ఆయన ధరించిన హెల్మెట్‌ను కూతురు ధరించింది. అండ్రూ అంతిమ యాత్ర కొనసాగుతున్నప్పుడు బాలిక హెల్మెట్ ధరించడంతో ఆస్ట్రేలియన్లు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. దీనికి సంబంధించిన చిత్రాన్ని ఎన్‌ఎస్‌డబ్ల్యు ఫైర్ సర్వీస్ తన పేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేసింది. డాడీ ఎప్పుడు కూతురికి హీరో గా ఉంటాడని, ఒక రోజు నువ్వు మీ డాడీని అర్థం చేసుకుంటావని, ఇవాళ అండ్రూ నీకే హీరో కాదు తమకు కూడా హీరోనే అని, రిప్ అని టాలీషా అన్నా కిండ్ అనే నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఈ చిత్రాన్ని చూసి ఏడుపు ఆపుకోలేకపోతున్నాను, నిజమైన హీరో నీ తండ్రి అమరుడయ్యాడని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వర్ణించడానికి పదాలు రావడంలేదని దేశం కోసం ప్రాణ త్యాగం చేశావని, దేశం మొత్తం అండ్రూను ప్రేమిస్తుందని దునియా డౌప్‌మాప్ అనే నెటిజన్ కొనియాడారు. ఆస్ట్రేలియాలో అడవి లో చెలరేగిన కార్చిచ్చులో 24 మంది సజీవ దహనం కాగా వందల మంది గల్లంతయ్యారు. వంద మిలియన్ల మూగజీవాలు చనిపోయాయని ఆస్ట్రేలియా అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

 

 

 

 

 

 

Australia Daghter wear dad’s helmet in his Funeral, 9-month-old daughter of Australian firefighter wore her dad’s helmet at his funeral

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News