Monday, April 29, 2024

రోహిత్‌కు పరీక్షలాంటిదే..

- Advertisement -
- Advertisement -

Australia tour difficult to Rohit Sharma: Nasser Hussain

లండన్: రానున్న ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మకు పరీక్షలాంటిదేనని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసేర్ హుస్సేన్ పేర్కొన్నాడు. ఇతర క్రికెటర్లతో పోల్చితే ఓపెనర్‌గా దిగే రోహిత్‌కు ఇది క్లిష్టమైన సిరీస్ అనడంలో సందేహం లేదన్నాడు. ఇటీవలే టెస్టు క్రికెట్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న రోహిత్ ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై సమస్యలు తప్పక పోవచ్చన్నాడు. అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొని ముందుకు సాగే సత్తా రోహిత్‌కు ఉన్న విషయం మరువ కూడదన్నాడు. కాగా, భారీ షాట్ల జోలికి వెళ్లకుండా ఆరంభంలో కాస్త సంయమనాన్ని పాటిస్తే మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడడం రోహిత్‌కు కష్టమేమీ కాదన్నాడు. ఇక సిరీస్‌లో ఆస్ట్రేలియాకే మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆసీస్ సమతూకంగా కనిపిస్తుందన్నాడు. మరోవైపు భారత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేమన్నాడు.ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా టీమిండియాకు ఉందని నాసేర్ పేర్కొన్నాడు.

Australia tour difficult to Rohit Sharma: Nasser Hussain

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News