Wednesday, May 8, 2024

చైనా దురాక్రమణకు ప్రధాని మోడీ తలొగ్గారు : రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

PM Modi bowed to Chinese aggression

 

న్యూఢిల్లీ: చైనా దురాక్రమణను అడ్డుకోలేక భారత ప్రధాని తలొగ్గారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు.‘ ఓవేళ ఆ భూభాగం చైనా వారిదే అయితే, మన సైనికులు ఎందుకు చనిపోయారు..? వారు ఎక్కడ చనిపోయారు..?’ అంటూ రాహుల్ ట్విట్ చేశారు. ఒక్క అంగుళం భూమి కూడా ఆక్రమణకు గరి కాలేదని శుక్రవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఓవేళ చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడలేదంటే వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి) వద్ద వెనక్కి వెళ్లాలంటూ చర్చలెందుకు..? జూన్ 16, 17 తేదీల్లో ఇరు పక్షాల దళాల మధ్య ఘర్షణలెందుకు జరిగాయి..? 20మంది సైనికుల్ని భారత్ ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది..? అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రశ్నించారు. చైనాకు ప్రధాని మోడీ క్లీన్ చిట్ ఇస్తున్నారా..? మేజర్ జనరల్స్ మధ్య చర్చలు దేనిపైనా..? అంటూ చిదంబరం ప్రశ్నించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News