Monday, April 29, 2024

ఆయుధాల చేరవేతకు పాక్ యత్నం భగ్నం

- Advertisement -
- Advertisement -

Pak attempt to carry arms was ruined

 

సరిహద్దులో డ్రోన్ కూల్చివేత

జమ్ము : జమ్మూకాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత గగనతలంలోకి చొచ్చుకు వచ్చిన పాకిస్థాన్ డ్రోన్‌ను బిఎస్‌ఎఫ్ దళాలు కూల్చివేశాయి. డ్రోన్ ద్వారా ఆయుధాల చేరవేతకు పాకిస్థాన్ యత్నించగా బిఎస్‌ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి. కతువా జిల్లాలోని పన్సార్ ఔట్‌పోస్ట్ వద్ద శనివారం ఉదయం 510కి ఈ సంఘటన జరిగింది. కూల్చివేసిన సమయంలో పాకిస్థాన్ డ్రోన్ 250 మీటర్లమేర భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిందని అధికారులు తెలిపారు. 9 రౌండ్ల కాల్పుల అనంతరం డ్రోన్ కూలిపోయినట్టు వారు తెలిపారు. డ్రోన్‌కు అమర్చిన అధునాతన రైఫిల్, 60 రౌండ్ల తూటాలున్న రెండు మేగజైన్లు, ఏడు గ్రెనేడ్లను బిఎస్‌ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. డ్రోన్ ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేయడానికి పాకిస్థాన్ ప్రయత్నించినట్టుగా ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News