Saturday, April 27, 2024

కార్గిల్‌లో పురాతన షియా మసీదుకు అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

కార్గిల్ : కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్‌లోని కార్గిల్‌లో ఆదివారం సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో పురాతన షియా మసీదుల్లో ఒక మసీదుకు అగ్ని ప్రమాదం సంభవించింది. షబ్‌ఎబరాత్ ప్రార్థనలకు ముందు ఈ ప్రమాదం సంభవించింది. బల్తీ బజార్ లోని ఈ మసీదుకు సాయంత్రం మంటలంటుకున్న కొన్ని గంటల్లో తీవ్రంగా చుట్టుముట్టాయి. అగ్నిమాపక యంత్రాలు వెంటనే ప్రమదస్థలానికి వెళ్లి మూడు గంటల్లో మంటలను అదుపు చేయగలిగాయి. సమీపాన ఉన్న ఇమాం బరా, నివాస గృహాలకు మంటలు విస్తరించకుండా నష్టాన్ని నివారించగలిగారు.

ప్రార్థనల సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించడమే ఈ ప్రమాదానికి దారి తీసిందని ప్రాథమిక సమాచారం ద్వారా తేలిందని పోలీస్‌లు చెప్పారు. కార్గిల్ లోని లడ్డాక్ స్వతంత్ర హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్ మొహమ్మద్ జాఫర్ అఖూన్ ప్రమాదస్థలాన్ని సందర్శించి నష్టాన్ని అంచనా వేశారు. మసీదు మొదటి అంతస్తు పూర్తిగా దెబ్బతిందన్నారు. ప్రాచీన వారసత్వ ఆస్తులు, ఇతర విలువైన వస్తువులు అగ్నిప్రమాదానికి గురయ్యాయని చెప్పారు. మసీదుకు సోలార్ ప్యానెళ్లను వీలైనంత వరకు అమర్చడమౌతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News