Thursday, April 18, 2024

పొలం బడి పాఠాలు

- Advertisement -
- Advertisement -

Students

 

నిర్మల్ : సోన్ మండలంలోని గంజాల్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పాఠశాల పక్కన గల వ్యవసాయ క్షేత్రంలోకి క్షేత్రపర్యటనలో భాగంగా వెళ్లి సేద్యం పనులు కొంత సేపు చూశారు. పొలంలో వ్యవసాయం చేసే వారితో కలిసి వరినాట్లను విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వేశారు. ఈ సందర్బంగా వ్యవసాయ క్షేత్ర నిర్వాహకులు మెట్‌పెల్లి సాయన్న మాట్లాడుతూ.. విద్యార్థులకు ఇలా పొలం పనుల పై అవగాహణ కల్పించడంతో విద్యార్థులకు వ్యవసాయ పనుల్లో సైతం ఉత్సాహం కలుగుతుందన్నారు. అనంతరం హెచ్‌ఎం రమేష్‌బాబు మాట్లాడుతూ.. సైన్స్‌ పాఠ్యాంశములలో భాగంగా ప్రత్యేక్షంగా వివరించడానికే ఈ మార్గం ఎంచుకున్నామన్నారు. వాస్తవ విజ్ఞానం కోసం జీవామృతం, ఎరువులు, మొక్కల పెంపకం , వరినారు ఏ విధంగా పెంచాలనే దాని పై విద్యార్థులకు అవగాహణ కలుగుతుందన్నారు.

Awareness on farm work for Students
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News