Monday, July 22, 2024

ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏంబిఆర్ నగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న విద్యార్థి ఎవరూ లేని సమయంలో గదిలోని ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతి చెందిన విద్యార్థి ఖమ్మం జిల్లాలోని మధిర మండలం మంగూర్ కు చెందిన సంగెపు నరేంద్ర(22) పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో నరేంద్ర బిటెక్ మూడో సంవత్సరం  చదువుతున్నాడు. అయితే, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News