Sunday, April 28, 2024

బాబు మోహన్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

కెఎ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరిక

మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపికి రాజీనామా చేసిన బాబు మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఆయన కెఎ పాల్ సారథ్యంలోని ప్రజా శాంతి పార్టీలోకి చేరారు. బాబు మోహన్‌కు కండువా కప్పి కెఎ పాల్ తన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆఫీసులో సోమవారం కెఎ పాల్ మీడియాతో మాట్లాడారు. బాబు మోహన్ ప్రముఖ టాలీవుడ్ నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రెండు సార్లు టిడిపి ఎంఎల్‌ఎగా, ఒకసారి టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎగా చేశారు. మంత్రిగానూ ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే ఆయనకు, ఆయన తనయుడికి మధ్య విభేదాలు వచ్చాయి.

ముఖ్యంగా రాజకీయాల విషయాల్లోనే ఈ విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత బాబు మోహన్ పార్టీకి రాజీనామా చేశారు. బిజెపి అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ఇచ్చినా ఆయన స్వీకరించలేదు. బాబు మోహన్ పార్టీలో చేరడం గురించి కెఎ పాల్ మాట్లాడారు. బాబు మోహన్ చేసిన సేవలు అందరికీ సుపరిచితం అని వివరించారు. 1451 సినిమాల్లో ఆయన నటించి మెప్పించారని తెలిపారు. ఆయన జన్మించిన వరంగల్ నుంచి ప్రజా శాంతి పార్టీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో ఆయన దిగుతారని వెల్లడించారు. తెలుగు ప్రజలు ఇన్ని రోజులు, బిజెపి, బిఆర్‌ఎస్, టిడిపి, కాంగ్రెస్ పాలనలు చూశారని, ఒక్కసారి ప్రజా శాంతి పార్టీ పాలననూ చూడాలని కెఎ పాల్ సూచించారు. తెలంగాణలో బాబుమోహన్‌ను గెలిపించి బిజెపికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ప్రజలను కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News