Saturday, August 9, 2025

సోదరుడికి రాఖీ కట్టేందుకు 14 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సోదరి

- Advertisement -
- Advertisement -

14 ఏళ్లుగా పాకిస్థాన్ లోని జైల్లో మగ్గిపోతున్న తన సోదరుడికి రాఖీ కట్టేందుకు ఓ సోదరి ఎదురు చూస్తుంది. వివరాలలోకి వెళితే.. మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన ప్రసన్నజిత్ రంగారీ అనే బిపార్మసి విద్యార్థి 2011 లో ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికిన జాడ తెలియలేదు.ఎంత వెతికిన జాడతెలియకపోవడంతో మరణించి ఉంటాడని కుటుంబసభ్యులు భావించారు. అయితే 2021 లో పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన భారతీయ ఖైదీ ప్రసన్న జిత్ రంగారీ కుటుంబాన్ని కలిసి ప్రసన్న జిత్ బతికే ఉన్నాడని,2019 నుంచి పాకిస్థాన్ జైలులో ఉన్నాడని తెలిపాడు. ప్రసన్న జిత్ పాకిస్థాన్ లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాడు. తన సోదరుడిని విడిపించాలని అతడి సోదరి సంఘమిత్ర విదేశాంగ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. భారత విదేశంగా శాఖ జోక్యం చేసుకొని తన సోదరుడిని పాక్ చెర నుండి విడిపించాలని వేడుకొంది. రక్షాబంధన్ సందర్భంగా తన సోదరుడికి పంపిన రాఖీ పాక్ అధికారులు లాహోర్ లోని కోట్ లఖ్ పత్ జైల్లో ఉన్న తన సోదరుడికి అందజేయాలని కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News