Sunday, December 15, 2024

క్లైమాక్స్ షూటింగ్‌కు సన్నాహాలు

- Advertisement -
- Advertisement -

నందమూరి నటసింహం బాలయ్య, – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిని మా టైటిల్ అనౌన్స్ మెంట్ కోసం ఓ పర్ఫెక్ట్ వీడియోను రెడీ చేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా పో స్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇదివరకే మొదలైంది. ఇక వచ్చే షెడ్యూల్‌లో ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు. ఈ క్లైమాక్స్ షూట్ పూర్తి అయ్యాక, బాలయ్య తన పాత్రకు డబ్బింగ్‌ను కూడా పూర్తి చేస్తారట.

కాగా ఈ మూవీ ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ ఇచ్చేలా దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారట. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగ వంశీ, ఫార్చూన్ ఫోర్ సినిమాపై సాయిసౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య పాత్ర నెవ్వర్ బిఫోర్ అనే రేంజ్‌లో ఉంటుందట. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News