Thursday, May 2, 2024

డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని కేటాయించారు : బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎంతమందికి కేటాయించారో వివరాలు ప్రకటించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల మంజూరు విషయంలో ప్రభుత్వ వైఖరి నిరసనగా మూసాపేటలో ఆత్మగౌరవ దీక్ష చేస్తున్న మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హరీశ్‌రెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ బిజెపి నేతలు మాధవరం కాంతారావు, వడ్డేపల్లి రాజేశ్వర్, కార్పొరేటర్ మహేందర్, నేతలకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే..రాష్ట్ర ప్రభుత్వం అన్నీ నిర్మించినట్లుగా లెక్కలు చూపిందని, అధికారులను నిలదీస్తే 7 వేల మందికే ఇండ్లను కేటాయించినట్లు తేల్చారన్నారు.

పేదల బాధలను తీర్చేందుకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లను నిర్మించింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఇండ్లు కావాలని అడిగితే లక్షన్నర ఇండ్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం చెబితే… మరో లక్ష ఇండ్లు అదనంగా మంజూరు చేశారని వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఎన్ని లక్షల మంది దరఖాస్తు చేశారు? ఎంతమందికి ఇండ్లు కేటాయించారు? ఎంతమంది ఆ ఇండ్లలో నివాసముంటున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఇండ్ల నిర్మాణం నాసిరకంగా ఉండడంతో.. వెళ్లకముందే కూలిపోయే దశలో ఉన్నాయని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News