Sunday, August 10, 2025

లాయర్లపై బార్ల వసూళ్లు కుదరవు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లాయర్ల పేర్ల నమోదుకు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు కానీ, బిసిఐ కానీ ఎటువంటి ఐచ్ఛిక రుసుం వసూళ్లకు దిగరాదు. సుప్రీంకోర్టు ఈ విషయాన్ని తమ ఆదేశాలలో వెలువరించింది. ఇటువంటి వసూళ్లు అవి ఇష్టపూర్తివి అయినా తప్పిదం కిందికి వస్తాయని స్పష్టం చేశారు. లాయర్లుగా నమోదుకు ఉండే చట్టబద్ధమైన ఫీజును లా పట్టభద్రుల నుంచి వసూలు చేసే ప్రక్రియ ఉంది. దీనికి మించి లాయర్లపై ఎటువంటి ఇతరత్రా రుసుం ఏ రూపంలో కూడా తీసుకోవడానికి వీల్లేదని న్యాయమూర్తులు జెబి పార్థీవాలా, ఆర్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. ఇంతకు ముందు ఈ విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. లా గ్రాడ్యుయెట్ల నుంచి పలు రాష్ట్రాల బార్ కౌన్సిల్స్ , బిసిఐ అనేక విధాలుగా రుసుం దండుకొంటోంది. ప్రత్యేకించి కర్నాటక స్టేట్ బార్ కౌన్సిల్ వ్యవహారం గమనించి , దాఖలైన పిటిషన్ ప్రాతిపదికన సుప్రీంకోర్టు ఉత్వర్వులు వెలువడ్డాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News