Monday, April 29, 2024

వికారాబాద్ అడవుల్లో పోరాటాలు

- Advertisement -
- Advertisement -

rrr

 

ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగాజరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో జరుగుతోందట. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరో వారం రోజుల పాటు జరుగుతుంది. ఇవి చరణ్‌కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే కావడంతో ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొనడం లేదట. ఈ షెడ్యూల్‌తో దాదాపుగా 80 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయినట్టేనని అంటున్నారు.

మార్చి నెలాఖరుకల్లా మొత్తం షూటింగ్ పూర్తిచేయాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆ తర్వాత పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెడతారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే ప్రమోషన్స్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో రామ్‌చరణ్ కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా జులై 30న ‘ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్ అవుతుందని… వాయిదా ఉండదని అంటున్నారు.

Battles in the forests of Vikarabad
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News