Wednesday, April 24, 2024

అందుకే కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నా

- Advertisement -
- Advertisement -

director Trivikram

 

సంక్రాంతి చిత్రాలలో ఒకటైన ‘అల వైకుంఠపురంలో’ ఆదివారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్‌తో ఇంటర్వూ…

మంచి సినిమా…
‘అల వైకుంఠపురం’లో మూవీ చూసి థియేటర్ నుండి బయటకి వచ్చిన ప్రేక్షకుడుకి మంచి సినిమా చూసిన భావన కలుగుతుంది. ప్రేక్షకులకు కావలసిన కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉన్నాయి.

పాటలన్నీ నచ్చాయి…
ప్రేక్షకుల్లోకి ‘అల వైకుంఠపురం’లో పాటలను తీసుకెళ్లడానికి చాలా శ్రద్ద తీసుకున్నాం. తమన్ స్వరపరిచిన అన్ని పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. మా ప్రయత్నానికి ఫలితమే ప్రేక్షకుల నుండి వస్తున్న మంచి స్పందన.

ఇంట్లో కూర్చొనే రాస్తా…
నేను సినిమా కథ, అలాగే అందులోని డైలాగ్స్ రాయడానికి ఎక్కడికో ప్రత్యేక ప్రదేశానికి వెళ్లను. మా ఇంట్లో భార్య పిల్లల మధ్య కూర్చొనే రాసుకుంటాను. కథలో భాగంగానే సహజంగా ఉండేలా మాటలు రాస్తాను.

అందుకే కుటుంబ కథా చిత్రాలు చేస్తున్నా…
ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు సామాజిక సమస్యలకు ఏమీ తక్కువ కాదు. మనం ఇంటికి వెళ్లగానే పలకరించే కుటుంబ సభ్యులు, వారితో గడిపే క్షణాలు మంచి అనుభూతినిస్తాయి. అందుకే నేను కుటుంబంతో ముడిపడిన కథా చిత్రాలు చేస్తున్నాను.

ఒకదానికొకటి పోటీ కాదు…
సంక్రాంతి సీజన్‌లో అన్ని సినిమాలకు డిమాండ్ ఉంటుంది. ఇక అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాల ట్రైలర్లు చూశాను. ఇవి రెండు భిన్న జోనర్స్‌కి చెందిన చిత్రాలు. కాబట్టి ఒకదానికొకటి పోటీ కాదు.

నటనలో మరింత పరిపక్వత…
గతంతో పోల్చుకుంటే బన్నీ నటనలో మరింత పరిపక్వత వచ్చింది. ఒక సినిమాకు బన్నీ కమిట్ అయితే తింటూ, నిద్రపోతూ కూడా సినిమా గురించే ఆలోచిస్తుంటారు. బన్నీ చాలా నిబద్ధత గల యాక్టర్.

అప్పుడే పాన్ ఇండియా మూవీ చేస్తా…
ప్రస్తుతానికి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించే కథ నా దగ్గర లేదు. అలాంటి కథ నాకు దొరికినప్పుడు ఖచ్చితంగా హిందీతో పాటు పలు భాషలలో ఆ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కిస్తాను.

Interview with director Trivikram
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News