Tuesday, May 6, 2025

గవర్నర్ తో బిసి సంఘాల భేటీ

- Advertisement -
- Advertisement -

బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినందుకు గవర్నర్ కు ధన్యవాదాలు

మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి సంఘాల నేతలు సోమవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను రాజ్‌భవన్‌లో కలిశారు. అసెంబ్లీ ఆమోదించిన బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు. బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బిసి సంఘాల ప్రతినిధుల బృందం గవర్నర్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందించి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన కులగనణ, అసెంబ్లీలో బిసి రిజర్వేషన్లపై ఏకగ్రీవంగా చేసిన బిసి బిల్లు, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలలో సమగ్ర కులగణను చేపట్టాలని నిర్ణయించడం తదితర అంశాలపై గవర్నర్‌తో జరిగిన భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా వెల్లడించారు. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించాడాన్ని అభినందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర క్యాబినెట్ గవర్నర్ ద్వారా బిసి ప్రతినిధుల బృందం ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో బిసి ఉద్యమం రోజురోజుకు బలపడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో గవర్నర్ తమ విశిష్ట అధికారాలను ఉపయోగించి 42 బిసి రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా, దేశంలోని సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా, కేంద్రంలో ఓబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్లు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. గవర్నర్‌ని కలిసిన ప్రతినిది బృందంలో బిసి కుల సంఘాల జెఎసి చైర్మన్ కుందారం గణేష్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్, బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బిసి విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బిసి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాం కురుమ, బిసి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి మని మంజరి సాగర్ తదితరులు ఉన్నారు. ఇబిసి సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు వల్లపు రెడ్డి రవీందర్ రెడ్డి నేతృత్వంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలిసి అగ్రవర్ణ పేదల అభ్యున్నతికి ఇబిసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరింది. రాష్ట్రంలో అగ్రకులాల్లో 90 శాతం కుటుంబాలు పేదరికంలో మగ్గుతూ దారిద్రంలో జీవిస్తున్నారని ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి తెలిపారు. రెడ్లు, ఆర్యవైశ్యులు, బ్రహ్మణులు, క్షత్రీయులు, కమ్మ, వెలమ, ముస్లిం, బలిజ, ఒంటరి, తెలగ తదితర కులాలకు చెందిన వారు కూడు, గుడ్డ, గూడు లేకుండా ఎంతో మంది జీవిస్తున్నారని తెలిపారు. వారి సంక్షేమం కోసం రూ.10 వేల కోట్లు కేటాయించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News