Thursday, May 2, 2024

ఆసియా కప్ ఫైనల్.. వాషింగ్టన్ సుందర్‌కు పిలుపు

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్ 2023 సూపర్-4లో భాగంగా భారత్ చివరి మ్యాచ్ ఆడింది. అయితే బంగ్లాదేశ్ ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది. గిల్, అక్షర్ పటేల్ పోరాడినా విఫలమయ్యారు. భారత్‌ను విజయపథంలో నడిపించే క్రమంలో అక్షర్ పటేల్ గాయపడడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. స్టంపౌట్ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కుడిచేతి చిటికెన వేలికి గాయమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే బంగ్లాదేశ్ ఫీల్డర్ దూరం నుంచి విసిరిన బంతి అక్షర్ చేతికి తగిలింది. దీంతో బెల్ట్ పెట్టుకుని మరీ బ్యాటింగ్ చేశాడు. ఆదివారం శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు భారత్ సిద్ధమైంది. గాయపడిన అక్షర్ కోలుకోవడం కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అక్షర్ స్థానంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అక్షర్ పటేల్ గాయాలతో బాధపడుతున్నాడు. చిటికెన వేలు, మోచేతికి గాయమై తొడ కండరాలు దెబ్బతిన్నాయి. దీంతో అక్షర్ రిలాక్స్ అయ్యాడు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌కు పిలుపునిచ్చినట్లు బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. మోచేయికి గాయమై వాపు వచ్చింది. దీంతో మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్ లో ఆడతాడా..? లేదా అనే సందేహం అభిమానుల్లో నెలకొంది.. మరోవైపు జనవరిలో న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ ఆడాడు. ఈ సంవత్సరం అతను ఆసియా క్రీడలకు ప్రకటించిన భారత జట్టులో సభ్యుడు కూడా. స్వదేశంలో ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్ నాటికి అక్షర్ కోలుకుంటాడని అంతా భావించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News