Sunday, April 28, 2024

కోహ్లి ఆరోపణల్లో నిజం లేదు

- Advertisement -
- Advertisement -

BCCI denied allegations made by Kohli

భారత క్రికెట్ బోర్డు

మరోవైపు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి చేసిన సంచలన ఆరోపణలను భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తోసిపుచ్చింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి ముందు బిసిసిఐ అధికారులు తనతో ఎలాంటి ముందస్తు చర్చలు జరపలేదని కోహ్లి చేసిన వ్యాఖ్యలను బిసిసిఐ కొట్టి పారేసింది. వన్డే కెప్టెన్ మార్పునకు సంబంధించి సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ ముందుగానే కోహ్లితో చర్చించాడని బోర్డు స్పష్టం చేసింది. ఇక విరాట్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని బిసిసిఐ పేర్కొంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఒకరే కెప్టెన్‌గా ఉండాలనే విషయాన్ని కోహ్లికి ముందుగానే చెప్పామని, అయితే అతను తమ అభ్యర్థనను పట్టించుకోలేదని బోర్డు వివరించింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే కోహ్లిని వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాల్సి వచ్చిందని బిసిసిఐ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News