Tuesday, April 30, 2024

బిసిలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాధరణకు గురైన కుల వృత్తులకు సిఎం కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం జీవం పోస్తుందని వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ. లక్ష సాయం అందించి అండగా నిలుస్తోందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథ కాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

గురువారం సమీకృత జిల్లా సముదాయ కా ర్యాలయంలో బిసి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కులవృత్తుల వారికి లక్ష రూపాయిల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా నియోజకవర్గానికి 50 మందికి చొప్పున రూ. లక్ష విలువ గల చెక్కును పంపిణీ చేస్తున్నామన్నారు.జిల్లావ్యాప్తంగా 14,521 నమోదు చేసుకున్నారని, వారిలో 11,746 లబ్ధ్దిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. జిల్లాల్లో ఉన్న విశ్వబ్రహ్మణ, నాయిబ్రహ్మణ, రజక, కుమ్మరి, కంసాలి,మేదరి వంటి వేలా ది కుటుంబాలకు లబ్ధ్ది చేకూరనున్నందని , ప్రతీ లబ్ధ్దిదారుడికి సహాయం అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News