Thursday, May 2, 2024

అందమైన ప్రేమ కథ

- Advertisement -
- Advertisement -

Bhagat Singh Nagar movie teaser released

 

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్ , ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’ . తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలయ్యే ఈ సినిమా టీజర్‌ను ప్రకాష్ రాజ్ విడుదల చేయడంతో ఈ చిత్రానికి మంచి హైప్ రావడం జరిగింది. అలాగే ఈ సినిమా మొదటి లిరికల్ సాంగ్ ’చరిత చూపని’కు మిలియన్ ప్లస్ వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాను ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు రమేష్ వుడుత్తు, వాలాజా గౌరిలు మాట్లాడుతూ.. “దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఇలాంటి ధీరుడి భావజాలాన్ని కమర్షియల్ హంగులతో సినిమాగా తీసినందుకు మా కెంతో గర్వంగా ఉంది..పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేస్తాం”అని అన్నారు. చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ “భగత్ సింగ్ నగర్‌లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ ఇది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది”అని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News