Sunday, April 28, 2024

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టడం వెనుక బిజెపికి ఒక భయం ఉంది

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై మోడీకి భయం పట్టుకుంది
అందుకే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ తెరపైకి తీసుకువస్తున్నారు
కేంద్రంపై టిపిసిసి అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

మనతెలంగాణ/హైదరాబాద్:  కేంద్ర ప్రభుత్వంపై టిపిసిసి అధికార ప్రతినిధి చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టడం వెనుక బిజెపికి ఒక భయం ఉందని కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించండంతో ప్రధాని మోడీకి భయం పట్టుకుందన్నారు.

వచ్చే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఓటమి ఖాయమని, అందుకే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ తెరపైకి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరపాలంటే అన్నీ రాష్ట్రాలకు ఒకే సారి జరపాలని, కానీ, కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఎన్నికలు జరిపితే ‘వన్ నేషన్- వన్ ఎలక్షన్’ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీకి 2023 సంవత్సరం అచ్చిరాలేదని ఆయన సెటైర్ వేశారు. మోడీకి 2023 సంవత్సరం కలిసిరాలేదని, అందుకే 2024 కోసం ఆయన ఎదురుచూస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News