Thursday, May 2, 2024

సోమవారం ఎంపీ శాసనసభా పక్షనేత ఎంపిక

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని బీజేపీ నూతన ఎమ్‌ఎల్‌ఎలు తమ శాసనసభా పక్ష నాయకుడిని ఎన్నుకోడానికి సోమవారం సమావేశం కానున్నారు. మొత్తం 230 స్థానాలకు 163 స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయినా ఇంతవరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. ప్రధాని నరేంద్ర ప్రజాదరణ పైనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశంలో రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తారని తెలుస్తోంది.

పార్టీ కేంద్ర పరిశీలకులు హర్యానా సిఎం మనోహర్ లాల్ ఖత్తర్, ఒబిసి మోర్చా అధినేత కె. లక్ష్మణ్, కార్యదర్శి ఆశా లక్రా తదితరులు సోమవారం ఉదయం 11 గంటలకు రానున్నారని తెలుస్తోంది. 2004 నుంచి మధ్యప్రదేశ్‌కు కేంద్ర పరిశీలకులను పంపడం బీజేపీకి పరిపాటి అయింది. ముఖ్యమంత్రి పదవికి రేసులో ప్రహ్లాద్ పటేల్, మాజీ కేంద్ర మంత్రి , డిమని ఎంఎల్‌ఎ నరేంద్ర తోమర్, ఇండోర్ హెవీ వెయిట్ కైలాష్‌విజయ్‌వర్గీయ, రాష్ట్ర బిజేపి చీఫ్ విడి శర్మ , కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యసిందియా తదితరులు పోటీ పడుతున్నారు. పటేల్, తోమర్, విజయ్‌వర్గీయ, శర్మ, సిందియా ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలో కలుసుకుని మంతనాలు సాగించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News