Friday, December 1, 2023

ప్రతి మహిళకు రూ.2వేలు ఇస్తానని కెసిఆర్ చెప్తున్నారు: ఈటల రాజేందర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బిజెపి ఎమ్మెల్సే ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ…. ప్రతి మహిళకు రూ.2వేలు ఇస్తానని కెసిఆర్ చెబుతున్నారన్నారు. మహిళలకు నెలకు రూ. 2వేలు ఇవ్వడం సాద్యం కాదని ఈటల వెల్లడించారు. అమలు సాధ్యం కాని హామీలు ఇవ్వడం శ్రేయస్కరం కాదని ఆయన సూచించారు. అణగారిన వర్గాల పక్షపాతిని నేను అని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పింఛన్లు సరైన సమయానికి అందడం లేదని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో చెప్తున్నా.. కెసిఆర్ ఇచ్చే హామీల అమలు అసాధ్యమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News