Sunday, June 16, 2024

బిఆర్ఎస్ పై వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ గెలిచింది: ఎంపి లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ గెలిచిందని బిజెపి ఎంపి లక్ష్మణ్ అన్నారు. అసాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. బుధవారం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆత్మీయ సమావేశంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం, విద్యుత్ మీద జరిగిన అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాయిదాలతో కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. గ్యారంటీలు, ఉచితాల పేరు మీద మనం కట్టిన పన్ను డబ్బులను వృథా చేస్తున్నారని అన్నారు. అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసిన నాయకుడు మోదీ ఆయన ప్రశంసించారు. లాల్ చౌక్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్వేచ్ఛగా తిరిగేలా మోదీ చేశారని లక్ష్మణ్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News