Thursday, May 2, 2024

బోనాల జాతరకు ఎంతో ప్రాముఖ్యం : మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే పండుగల్లో బోనాల జాతర కు ఎంతో ప్రాముఖ్యత ఉందని మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మై నం పల్లి హన్మంతరావు అన్నారు. దేశంలో ఎక్క డా లేని విధంగా బోనాల జాతరను ఘనంగా నిర్వహించడం కోసం అమ్మవారి ఆలయాలకు నిధుల ను కేటా యించిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. బోనాల ఉత్సవాల్లో భాగం గా సోమవారం సెట్విన్ మాజీ డైరెక్టర్, జాంబాగ్ డివిజన్ బిఆర్ ఎస్ ప్రోగ్రాం కో=ఆర్డినేటర్ ఎస్ ధన్‌రాజ్ ఆధ్వర్యంలో న్యూ ఉస్మాన్‌గంజ్‌లో నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని అమ్మవారికి ప్ర త్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోషామహల్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇంచార్జి నందకిశోర్‌వ్యాస్, తెలంగాణ ఉద్యమనేత ఆర్వీ మహేందర్ కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఉత్సాహంగా నృత్యం చేస్తూ, స్టెప్పులు వేసి కార్య కర్తలను అలరించారు.

అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బోనాల ఉత్సవాల్లో పాల్గొని, అమ్మవారికి పూజలు ని ర్వహించి, ధన్‌రాజ్ ఆ ధ్వర్యంలో చేపట్టిన ఫలహారం బండి ఊరేగింపును ప్రారంభించారు. ఈ సందర్బంగా ధన్‌రాజ్ నేతృత్వంలో మైనంపల్లి హన్మంత రావుపై రూపొందించిన పాటల సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత పం డు గలకు సరికొత్త శోభను సంతరించుకున్నా యని అన్నారు. బోనాల పం డుగను తెలంగాణ ప్రభు త్వం రాష్ట్ర పండుగగా ప్ర కటించిందని తెలిపారు. ప్రజలు బోనాల ఉత్సవాలను ప్రశాంత వాతా వరణంలో భక్తి, శ్రద్ధ్దలతో జరు పుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మైనంపల్లిరి సెట్విన్ మాజీ డైరెక్టర్ ధన్‌రాజ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి బిజెపి ఫ్లోర్ లీడర్ జి శం కర్‌యాదవ్, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్‌గుప్తా, బీఆర్‌ఎస్ నేత ఎక్కాల నందు, ఆనంద్ సింగ్, జాంబాగ్ డివిజన్ బిఆరన్‌ఎస్ అధ్యక్షులు ఎం శ్రీనివాస్ గౌడ్, నాయకులు సురేష్ ముదిరాజ్, మనోహర్ గైక్వాడ్, రమేష్ గుప్తాలతోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News