Thursday, May 2, 2024

బోన్సాయ్ మొక్క దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Bonsai Plant Thieves Arrested in Hyderabad
పరారీలో మరో నిందితుడు

హైదరాబాద్: మాజీ ఐపిఎస్ అధికారి అప్పారావు ఇంటి ఎదుట ఉన్న బోన్సాయ్ మొక్కను దొంగిలించిన ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న మాజీ ఐపిఎస్ అధికారి అప్పారావు ఇంటి ఆవరణలో ఉన్న చెట్టును ఈ నెల 12వ తేదీన దొంగలు చోరీ చేశారు. లక్షన్నర రూపాలయ్ విలువైన బోన్సాయ్ చెట్టును దొంగిలించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని యూసుఫ్‌గూడ, ఎస్‌పిఆర్ హిల్స్, ఓమ్ నగర్‌కు చెందిన గొల్లపూడి ప్రసన్నాంజనేయులు, అభిషేక్ కన్‌స్ట్రక్షన్ పనిచేస్తున్నారు. ఇద్దరిలో ప్రసన్నాంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకోగా, అభిషేక్ పరారీలో ఉన్నాడు.

జూబీ హిల్స్ రోడ్డు నంబర్ 18,ప్లాట్ నంబర్ 406లో విశ్రాంత ఐపిఎస్ అప్పారావు కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఆయ పదిహేను ఏళ్ల క్రితం అరుదైన బొన్సాయ్ మొక్కను కొనుగోలు చేశారు. ప్రధాన గేటు వద్ద నాటారు. ఇటీవల తోటమాలి దేవేందర్ మొక్కలకు నీరు పోస్తుండగా బొన్సాయ్ మొక్క కనిపించలేదు. ఈ విషయాన్ని యజమానులకు చెప్పాడు. అప్పారావు భార్య శ్రీదేవి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు జూబ్లీహిల్స్ ఇన్స్‌స్పెక్టర్ తెలిపారు,.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News