Monday, June 17, 2024

బూత్ వారీ ఓటింగ్ డేటాను వెబ్ సైట్ లో  పెట్టడం కుదరదు: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పోలింగ్ జరిగిన 48 గంటల్లో ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎన్ని ఓట్లు పోలయ్యాయని బూత్ ఓటర్ల డేటాను ఎన్నికల సంఘం వెబ్ సైట్లో అప్ లోడ్ చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.  ఎడిఆర్ ఎన్ జివో సంస్థ ఈ విషయమై పెట్టుకున్న అభ్యర్థనను తిరస్కరించింది. ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు అయిపోయినందున ఇలాంటి తాత్కాలిక ఆదేశాలు జారీచేయలేమని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. బూత్ డేటాను అప్ లోడ్ చేయడం వల్ల ఓటర్లు అయోమయానికి గురికావొచ్చని ఎన్నికల సంఘం కోర్టులో వాదించింది. ఫారమ్ 17సి డేటాను అభ్యర్థి  లేదా బూత్ ఏజెంట్ కు మాత్రమే ఇస్తామని ఎన్నికల సంఘం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News