Tuesday, March 5, 2024

మేడ్చల్‌లో ఘోరం

- Advertisement -
- Advertisement -

Boy Disappeared and was Killed in Shamirpet

 

బాలుడి కిడ్నాప్, హత్య
పోలీసుల విచారణలో నిందితుడి అంగీకారం
సంఘటన స్థలాన్ని పరిశీలించిన
పేట్‌బషీరాబాద్ ఎసిపి నర్సింహారావు
నిందితున్ని ఉరి తీయాలని పోలీసు స్టేషన్ ముందు కుటుంబీకుల ఆందోళన
సంఘటన స్థలంలోనే మృతదేహానికి పోస్టుమార్టం

మన తెలంగాణ/శామీర్‌పేట : అదృశ్యం అయిన బాలుడు కళేబరంగా కని పించిన హృదయవిదారకర సంఘటన శా మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కన్నవారు చివరి చూపునకు నో చుకోకుండా ఎముకల గూడగా మరాడు. పే టబషీరాబాద్ ఎసిపి నర్సిహారావు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. శామీర్ పే ట గ్రామానికి చెందిన సయ్యద్ యూసఫ్ ఆ టో డ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు. భా ర్య గౌసియా, సంతానం అధిబి, ర హాన్, ఫల్హాన్, అథియాన్(5) ఉన్నారు. అదే గ్రామంలోని చాంద్‌పాషా ఇంట్లో క్రింది ఫోర్షన్‌లో నివాసం ఉం టున్నారు. అదే ఇంట్లో పై ఫోర్షన్‌లో ఈ నెల 8వ తేదిన 17 సంవత్సరాల వయస్సుగల మైనర్ బాలు డు (సుధాన్షూశర్మ) స్నేహితుడు రాజుతో కలిసి అద్దెకు ఉండటంతో వారి మధ్య పరిచయాలు పెరిగాయి.

ఈ క్రమంలో డాబాపై అద్దెకు ఉంటున్న యువకుడు అథి యాన్‌తో కలిసి ఈనెల 15వ తేదిన మధ్యాహ్నం స మయంలో షేర్ చాట్ చేస్తూ.. ఒక్కసారిగా క్రింద పడిపో వడంతో బాలుడు అపస్మాకర స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురైన యువకుడు బాలుడిని ప్లాస్టిక్ టేప్ చుట్టి ఒక్క బ్యాగ్‌లో వేసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా అక్కడ నుంచి నడుచుకుంటు వెల్లి ఔటర్ రింగ్‌రోడ్డు జంక్షన్ వద్ద ఉప్పర్‌పల్లి గ్రామానికి వెల్లే సర్వీస్ రోడ్డుకు చేరుకున్నాడు. సర్వీస్ రోడ్డులో ఏర్పాటు చేసిన చెట్ల మధ్య ఉన్న బండరాళ్ల ప్రాంతంలో బాలుడిని పడవేసి అక్కడి నుంచి ఏమి తెలియనట్లు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి బాలుడు కనిపించకపోవడంతో ఈ విషయం తెలియని బాలుడు తల్లిదండ్రులు పరిసర ప్రాం తాలు, బంధువుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో అదేరోజు రాత్రి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

డబ్బులు డిమాండ్ చేసి పట్టుబడ్డ నిందితుడు

ఈ నెల 15వ తేదిన బాలుడు కనబడకుండా పోయిన విషయంలో నిందితుడు చాకచర్యంగా వ్యవహరించాడు. బాధిత కుటుంబీకుల పక్కనే ఉంటు బాలుడు మృతి చెందిన విషయాన్ని దాచిపెట్టాడు. బాలుడి విషయంలో ఏం జరుగుతుందనే విషయంపై నిఘా పెట్టిన తను డబ్బులపై దృష్టి సారించాడు. అప్పటికే బాలుడి విష యంలో డబ్బులు ప్రస్తావన రావడంతో ఆదిశగా దృష్టి సారించారు. తన గదిలో ఉంటున్న రాజు ఫోన్ దొంగలించాడు. ఆ ఫోన్‌తో ఇంటి యజమాని అయిన చాంద్‌పాషాకు ఈ నెల 24వ తేది ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఫోన్ చేసి రూ. 15 లక్షలు డి మాండ్ చేసి బాలుడి తండ్రి ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నాడు. ఫోన్ కట్ అయిన వెంటనే చాంద్‌పాషా బాధిత కుటు ంబీకులతో కలిసి పోలీసులను సంప్రదించారు. పో లీసులు నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారి ంచగా తాను బాలుడిని హత్య చేసినట్లు ఒప్పుకోవడంతో అదృశ్యమైన బాలుడు హత్యకు గురైనట్లు నిర్ధారి ంచుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృ తదేహాన్ని పరిశీలించారు. ఏసీపీ నర్సింహ్మరావు పర్య వేక్షణలో ఉస్మానియ వైద్యులు బాలుడు కళేబరానికి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టుం నిర్వహించారు.

బాధిత కుటుంబీకుల ఆందోళన

బాలుడు కిడ్నాప్ ఆపై హత్య కేసులో బాధిత కుటుంబికులతో పాటు గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలుడిని హత్యచేసిన నిందితుడకి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. దింతో సిఐ సంతోషం తన సిబ్బందితో కలిసి ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పారు. దింతో శాంతించి అక్కడి నుంచి వెల్లిపోయారు.

5 పోలీసు స్టేషన్ల సిబ్బంది పహరా

అదృశ్యం అయిన బాలుడు హత్యకు గురైన విషయం తెలుసుకున్న పేట్‌బషీరాబాద్ ఏసీపీ తన పరిధిలోని 4 పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బందిని శామీర్‌పేకు తరలించారు. పోలీసు స్టేషన్‌తో పాటు బాధిత కుటుం బీకులు నివాసం ఉంటున్న ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మృతదేహానికి పోస్టుమార్టుం నిర్వహించిన వెంటనే అంత్యక్రియలను పోలీసు పహార మధ్య జరిపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News