Thursday, May 2, 2024

కాషాయం కట్టల పాములు

- Advertisement -
- Advertisement -

Searches at Raghunandan Rao's office and relatives' houses

 

నోట్ల సంచులతో ఓట్లు కొట్టేయాలన్న బిజెపి మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపే లక్షంగా ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతున్నట్లుగా సోమవారం సిద్దిపేటలో జరిగిన 6 గంటల క్యాష్ హైడ్రామా రుజువు చేస్తున్నది. అక్టోబర్ 5న శామీర్‌పేటలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు తెర వెనుక సూత్రధారిగా రూ. 40 లక్షల కరెన్సీని పోలీసులు పట్టుకోగా, తాజాగా సిద్దిపేటలో ఆయన బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో రూ. 18 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. ఇది తెలిసిన ఆ పార్టీ కార్యకర్తలు, పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదును చట్ట ప్రకారం తీసుకెళ్లకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులపైనే దౌర్జన్యం, అరాచకం సృష్టించి అక్రమ డబ్బు సంచులను బాహాటంగా ఎత్తుకెళ్లారు. పట్టపగలు బిజెపి నేతలు సృష్టించిన అరాచకంపై అధికార యంత్రాంగం సీరియస్‌గా చర్యలు తీసుకునే ఏర్పాట్లలో ఉంది.

దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు
బంధువు సురభి అంజన్‌రావు ఇంట్లో దొరికిన
రూ.18 లక్షల నగదు పోలీసులు, రెవెన్యూ
అధికారులను అడ్డుకొని అరాచకం సృష్టించిన బిజెపి
గుంపులను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీచార్జీ, శివార్లలో బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు
6గంటల పాటు హైడ్రామా
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై
దౌర్జన్యంపై జిల్లా యంత్రాంగం సీరియస్
మొన్న రూ. 40 లక్షలు.. నేడు రూ. 18 లక్షలు

మనతెలంగాణ/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు నోట్ల కట్టల పాములు బయటకు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపపోరులో బిజెపి అభ్యర్థి రఘునందర్‌రావు సమీప బంధువు అంజన్‌రావు ఇంట్లో సోమవారం నాడు పోలీసు, రెవెన్యూ అధికారుల సోదాలలో రూ. 18.67 లక్షలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో తనికీలు చేపట్టిన అధికారులపై బిజెపి కార్యకర్తలు జులుం చేసి సీజ్ చేసిన మొత్తం రూ. 18,067లలో రూ. 5 లక్షల 87 వేల రూపాయలు అపహరించారు. ఒక్కసారిగా 250 మంది కార్యకర్తలు అటు పోలీసులను, ఇటు రెవెన్యూ అధికారులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ నేపథ్యంలో సోదాలు ముగించుకుని అంజన్‌రావు ఇంట్లో నుంచి బయటకు వస్తున్న అధికారులను అడ్డుకున్న బిజెపి కార్యకర్తలు వారిపై విరుచుకుపడి రూ. 5,87లక్షలు చోరీ చేశారని సిద్ధిపేట పోలీస్‌కమిషనర్ జోయెల్ డేవిస్ మీడియాకు తెలిపారు. ఇదిలావుండగా ఉపపోరులో ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నాడన్న పక్కా సమాచారం అందడంతో రెవెన్యూ, పోలీసు అధికారులు దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఇళ్లలో, కార్యాలయాల్లో సంయుక్తంగా సోదాలు నిర్వహించారు.

సిద్దిపేటలో రఘునందన్‌రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లతో పాటు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు.తొలుత సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్స్ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ అధికారుల తనిఖీల విషయం తెలుసుకున్న బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాకలో తన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపిపి వేసి అక్కడి నుంచి ఆయన సిద్దిపేటలోని తన అత్తారింటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.పెద్దసంఖ్యలో అక్కడకు వచ్చిన బిజెపి శ్రేణులు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. ఇదిలావుండగా దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావుకు చెందిన వ్యక్తుల వద్ద నగదు దొరకడం ఇది రెండోసారి. సుమారు 10 రోజుల ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి సిద్దిపేట వస్తున్న కారును తనిఖీ చేయగా అందులో రూ. 40 లక్షల నగదు లభించింది. విచారణలో కారులో ఉన్నవారు రఘునందన్ రావు అనుచరులుగా తేలింది. తాజాగా సిద్ధిపేట లెక్చరర్స్ కాలనీలోని రఘునందన్‌రావు మామ గోపాల్‌రావు ఇంట్లోనూ మూడు గంటల పాటు సోదాలు చేపట్టారు.

అయితే ఆయన ఇంటి పక్కనే ఉంటున్న అంజన్‌రావు ఇంట్లో జరిపిన సోదాలలో రూ. 18,067వేల రూపాయాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా తనిఖీల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని, నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తున్నారని అక్కడే బైఠాయించిన రఘునందన్ నిరసన చేపడుతున్న క్రమంలో బిజెపి కార్యకర్తలు అధికారులపై జులుం ప్రదర్శించారు.

సీజ్ చేసిన మొత్తాలలో చోరీ : పోలీస్‌కమిషనర్ జోయెల్ డేవిస్

దుబ్బాక ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అంజన్ రావు ఇల్లు కేంద్రంగా సోమవారం ఉదయం నుండి డబ్బు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం ఉందని సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.ఈక్రమంలో సిద్ధిపేట అర్బన్ మండల మెజిస్ట్రేట్ విజయ్ సాగర్ తో కలిసి సోదాలు చేపట్టామన్నారు. కాగా బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు సమీప బంధువు అంజన్‌రావు ఇంట్లో సీజ్ చేసిన రూ. 18,067 లక్షలలో రూ. 5,87 లక్షలు అపహరించారని పోలీస్‌కమిషనర్ జోయెల్ డేవిస్ సోమవారం రాత్రి మీడియాకు తెలిపారు. ఈక్రమంలో నగదును అధికారులను నుంచి అపహరించిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలలో రఘునందన్‌రావు సమీప బంధువు అంజన్‌రావు ఇంట్లో సీజ్ చేసిన మొత్తం రూ. 18,067లలో రూ. 5 లక్షల 87 వేల రూపాయలు అపహరించారని తెలిపారు. ఇదిలావుండగా సోమవారం మధ్యాహ్నం దుబ్బాక ఓటర్లను ప్రభావితం చేసేందుకు నగదు పంపిణీ జరుగన్నుట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైయ్యామని పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.

వెంటనే సిద్ధిపేట ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో మూడు ప్రాంతాలలో తనికీలు చేపట్టడం జరిగిందన్నారు. తొలుత సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, తరువాత సురభి రాంగోపాల్‌రావు ఇంట్లో చేపట్టిన సోదాలలో నగదు లభ్యం కాలేదన్నారు. అనంతరం సురభి అంజన్‌రావు ఇంట్లో సోదాలు చేపట్టగా రూ. 18.67 దొరికాయని, అంజన్‌రావు బావ మరిది జితేందర్‌రావు తన డ్రైవర్ ద్వారా పంపించినట్లు విచారణలో తేలిందన్నారు. ఎన్నికల సందర్భంగా తాము పంపించిన మనుషులకు కొద్దికొద్దిగా నగదు పంపిణీ చేయాలని సూచించినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని వివరించారు. పట్టుబడిన నగదు ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ సమక్షంలో సీజ్ చేశామని, నగదును అంజన్‌రావు ఇంటి నుంచి బయటకు తీసుకొస్తున్న క్రమంలో దాదాపు 250మంది బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు అనుచరులు వచ్చారని, వీరిలో 30 మంది దాదాపు రూ. 5.87 లక్షల నగదును అపహరించారన్నారు.

నగదు చోరీపై కేసు నమోదు 

ఎన్నికలలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నగదును అపహరించిన వారిపై పోలీసు కేసులు నమోదు చేసినట్లు సిద్ధిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు. అధికారుల నుంచి డబ్బు ఎత్తుకెళ్లిన వారిని గుర్తిస్తున్నామని, పోలీసు విధులకు ,ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారి పై కూడా కేసు నమోదు చేశామన్నారు. ఇందులో భాగంగా అంజన్ రావు ఇంటికి వెళ్లినప్పటి నుండి జరిగిన సోదాలను రికార్డు చేశామని, ఆయా ఫుటేజీలను పరిశీలిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ప్రశాంత వాతావరనాణానికి ఎవరైనా భంగం కలిగించినా, ఓటర్లను డబ్బు తో ప్రలోభాలకు గురి చేయాలని చూసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సిద్ధిపేట సిపి తెలిపారు.

పోలీసులపై మండిపాటు ః

దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు పోలీసులపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు వారిపై మండిపడ్డారు. తమ బంధువులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏ ఆధారాలతో తనిఖీ చేస్తున్నారని పోలీసులతో వివాదానికి దిగారు. తమను పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారని రఘునందన్‌రావు మండిపడ్డారు. రఘునందన్ రావు ఇళ్లలో, కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. సిద్దిపేటలో రఘునందన్‌రావు అత్తారిల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు జరిపారు. మొత్తం 8 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు. తనిఖీల విషయం తెలుసుకున్న రఘునందన్‌రావు సోదాలు జరుపుతున్న పోలీసుల అనుమతిలేకుండా ఇంట్లోకి వెళ్లడానికి ఆయన ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆయనకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

హై ‘డ్రామా’ ః

బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు బంధువు ఇంట్లో నగదు లభ్యంకాగానే పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చిన బిజెపి శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొమ్మును తీసుకెళ్లేందుకు బిజెపి కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో రఘునందన్ రావు సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీస్‌కమిషనర్ జోయెల్ డేవిస్ అంజన్ రావు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం పోలీసులు బిజెపి శ్రేణులను చెదరగొట్టారు.

మీడియా ముసుగులో నగదు పంపిణీ ః

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బిజెపి అభ్యర్థి మీడియా ముసుగులో నగదు పంపిణీ చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు చానల్ ప్రచారం పేరిట దుబ్బాక నియోజక వర్గంలోని బిజెపి నాయకుల, కార్యకర్తలను కలుస్తూ నగదు పంపిణీ చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందటంతో అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో సదరు మీడియా చానల్ వాహనాలలో తనికీలు చేపట్టారు. బిజెపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న సదరు చానల్ సిబ్బంది ద్వారా దుబ్బాక నియోజక వర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులకు నగదు చేరవేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో ముమ్మరంగా సోదాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సదరు చానల్ ప్రచారం పేరిట దుబ్బాక నియోజక వర్గంలోని బిజెపి నాయకుల, కార్యకర్తలకు నగదు చేరవేస్తున్నట్లు ఫిర్యాదు అందటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమైయ్యారు. ఈక్రమంలో మీడియా ముసుగులో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న బిజెపి నేతలపై, చానల్ సిబ్బంది, ప్రతినిధులపై నిఘా సారిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News