Saturday, December 9, 2023

అత్తింటి వేధింపులు.. నవ వధువు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  అత్తింటి వేధింపులకు తాళలేక నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…కాటేదాన్, నేతాజీ నగర్‌కు చెందిన చద్రశేఖర్,కవితకు పెద్దలు ఏడు నెలల క్రితం వివాహం చేశారు. పెళ్లి సమయంలో కవిత తల్లిదండ్రులు కట్నకానుకలతోపాటు అన్ని లాంఛనాలు ఇచ్చారు. వివాహమైన ఏడు నెలల తర్వాత అదనపు కట్నం తేవాలని భర్త, అత్తామామ, ఆడపడుచులు వేధించడం ప్రారంభించారు.

అత్తామామ, ఆడపడుచులు సూటిపోటి మాటలు మాట్లాడడంతో ఇబ్బందులు పడుతున్న కవితన భరత్త మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేని కవిత ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కవిత తల్లిదండ్రులు తమ బిడ్డను వేధింపులకు గురిచేసిన అత్తామామ, ఆడపడుచులు, భర్తపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితులపై 304బి ఐపిసి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News