- Advertisement -
ములుగు జిల్లాలోని నూతనంగా ఏర్పాటైన మల్లంపల్లి మండల కేంద్రంలోని ఎస్ఆర్ఎస్పీ కాలువ బ్రిడ్జి కుంగి పోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం ములుగు నుండి వరంగల్ వెళ్లే వాహనాలు, అబ్బాపూర్, రేగొండ, పరకాల మీదుగా హనుమకొండకు చేరుకునే విధంగా, వరంగల్ నుండి ములుగు కు వచ్చే అన్ని రకాల వాహనాలు గుడేపాడు, పరకాల నుండి రేగొండ, అబ్బాపూర్ మీదుగా ములుగు చేరుకునే విధంగా పోలీసులు వాహనాలు మళ్లిస్తున్నారు. గత కొంతకాలంగా ఈ ప్రాంతంలో నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఉన్నట్టుండి సాయంత్రం ఒక్కసారిగా బ్రిడ్జ్ కుంగిపోవడంతో వాహన రాక,పోకలకు అంతరాయం ఏర్పడగా వెంటనే స్పందించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ వైపుగా వాహనాలు రా వద్దని పోలీసులు హెచ్చరించారు.
- Advertisement -