Wednesday, August 6, 2025

బిఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాలి: ఎంపి మల్లు రవి డిమాండ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయని పార్టీల గుర్తింపు రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపి మల్లు రవి ప్రధాన ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఈ రకంగా సిఇసి చర్యలు మొదలు పెడితే తొలుత బిఆర్‌ఎస్ గుర్తింపు రద్దు చేయాల్సి వస్తుందని ఆయన తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో బుధవారం ధర్నా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పార్టీ ఎంపీలు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సమావేశానంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అయినా బిఆర్‌ఎస్‌కు కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే తాము 90 శాతం హామీలు చేశామని ఆయన తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు రుణ మాఫీ, రైతు బీమా నిధుల విడుదల, పేదలకు సన్న బియ్యం పంపిణీ, సన్న బియ్యం పండించే రైతులకు సబ్సిడీ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వివరించారు.

నేడు జంతర్ మంతర్ వద్ద ధర్నా
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని వత్తిడి తెచ్చేందుకు బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు మల్లు రవి తెలిపారు. ఈ ధర్నాలో ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొంటారని ఆయన చెప్పారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తాము రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News